calender_icon.png 17 July, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లుంగీ, బనియన్లతో నిరసన

17-07-2025 01:36:05 AM

- క్యాంటీన్ మేనేజర్‌పై సంజయ్ గైక్వాడ్ దాడిని ఖండించిన ప్రతిపక్షాలు

- మహారాష్ట్ర అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం  

ముంబై, జూలై 16: ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద లుంగీ, బనియన్లు ధరించారు. లుంగీ బనియన్‌లో వచ్చి శివసేన ఎమ్మెల్యే గత మంగళవారం క్యాంటీన్ మేనేజర్‌పై దాడి చేసిన తీరును ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘చడ్డీ బనియన్ గ్యాంగ్‌ను మేం ఖండి స్తున్నాం’ అని నినాదాలు చేశారు. ప్రజాప్ర తినిధి అయ్యుండి ఒక వీధిరౌడీ మాదిరిగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చెడ్డీ బనియన్ గ్యాంగ్.. లుంగీ గ్యాంగ్ అంటూ స్లోగన్లు మారుమోగాయి.

ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని క్యాంటీన్‌లో పప్పు క్వాలిటీ బాగాలేదంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెల్లుమనిపించాడు.  తాను అలా ప్రవర్తించడంలో తప్పే లేదని ఘటన తర్వాత సమర్థించుకోవడం చర్చనీ యాంశంగా మారింది.