calender_icon.png 9 May, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో సమస్యలు ఇన్నన్నికావు?

17-04-2025 12:00:00 AM

తిరుమలకు వెళుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొనేకంటే తెలంగాణలోని యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం మేలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమధ్య అనడం అంగీకరించవలసిన విషయమే. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతికి వెళ్లిన భక్తులకు అక్కడి సిబ్బంది సరైన సమాచారం ఇవ్వక పోవడం, భక్తుల తో దురుసుగా ప్రవర్తించడం, ఏది అడిగినా నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడం చేస్తున్నారు.

కలియుగ దైవం, ఆపద మొక్కలవా డు, శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులను కంపార్ట్‌మెంట్‌లలోకి పంపించి, అ క్కడ గంటల తరబడి నిరీక్షింపజేయడాన్ని చాలామంది తట్టుకోలేక పోతున్నారు. ము ఖ్యంగా శనివారం నాడు, ఇతర సెలవు దినాలలో 24 గంటలకుపైగా దర్శనం కోసం స మయం పడుతున్నది. తీరా స్వామిని ఓపిగ్గానైనా చూడనిస్తారా అంటే లేదు. అక్కడే ఇద్ద రు, ముగ్గురు వ్యక్తులు ఉండి, బలవంతంగా తోసేస్తుంటారు.

వేల రూపాయలు వ్యయం చేసుకొని అంత దూరం వెళితే భక్తులకు కలిగేది పరాభవం కాక మరేమిటి? ఒక రకంగా అన్యమతస్తులను తిరుమలలో సిబ్బందిగా నియమించడం వల్ల కూడా వారిలోని ఒక వర్గం ఈ తరహా పనులకు తెర తీస్తుండవచ్చునని కూడా కొన్ని అనుమానాలు ఉన్నా యి. ముఖ్యంగా తెలంగాణ వంటి సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులకు తిరుమల నిర్వాహకులు నరకమే చూపిస్తున్నారు.

మ రోపక్క అక్కడి దుకాణాల యజమానులు ఎక్కువ మొత్తం డబ్బుతో వస్తువులను విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. తెలంగాణలో అనేక దేవాలయాలు ఉన్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భద్రాది సీ తారాముల దేవాలయం, వేములవాడ, ధర్మపురి, బాసర, కీసరగుట్ట, జోగులాంబ వంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. తిరుమల లో సిఫారసు ఉత్తరాలు నడవవని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్న పరిస్థితిని చూస్తు న్నాం. 

మన దేవాలయాల దేవుళ్ళను దర్శించుకొని మానసిక ప్రశాంతత పొందాలని ముఖ్యమంత్రిసహా అధికారులు కోరుతున్నా రు. దీనిని ప్రజల మనోభావాలు, ఆత్మ గౌర వం దెబ్బ తీయడంగా చూడవలసిన పనిలే దు. ఒక రకంగా  అభినందించదగ్గ విషయం. 

 డా. ఎస్. విజయ భాస్కర్