16 March, 2026 | 3:10 AM

Breaking News

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నివాళులు

16-03-2026 12:00 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, మార్చి 15 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లా కూల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బోగూడ భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతి చెందారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం బోగూడ భూపతిపూర్ గ్రామానికి చేరుకొని గోకని సాయ గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల బాధను చూసి పద్మదేవేందర్ రెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో సాయ గౌడ్ మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. అనంతరం సాయ గౌడ్, బూరుగుపల్లి అమృత్ గౌడ్ కుటుంబానికి చెరో 10,000/- చొప్పున రూ.20,000/- ఆర్థిక సహాయం చేశారు. వీరి వెంట నాయకులు రాఘవ రెడ్డి, జీవన్ రెడ్డి, యాదగిరి, లక్ష్మిపతి, అరవింద్, కుమార్, సంతూ, శ్రీశైలం, మ్యాకల సాయిలు, సాప సాయిలు, రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.