calender_icon.png 17 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా?

17-07-2025 01:19:31 AM

- సీఎం రేవంత్‌రెడ్డికి జగదీశ్‌రెడ్డి సవాల్

- సూర్యాపేటలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

సూర్యాపేట, జూలై 16 (విజయక్రాంతి): సాగునీటి ప్రాజెక్టులపై నోటి కొచ్చినట్టు మాట్లాడే రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బు ధవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కా ళేశ్వరం సమగ్ర స్వరూపంపై సీఎంకు అవగాహన ఉందా అని ప్రశ్నించా రు.

ప్రపంచంలోనే కాళేశ్వరం ఓ అ ద్భుత ప్రాజెక్టు అన్న విషయం మర్చిపోయి కాంగ్రెస్, బీజేపీలు కూలేశ్వ రం అంటూ విషప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేటకు వచ్చాయో, లేదో తేల్చుకునేందుకు చిన్న సీతారాంతండాకు వెళ్దాం రావాలని సీఎంను ఆ హ్వానించారు.

ఇసుక దందాకోసమే కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం నీళ్లు ఇస్తలేరని ఆరోపించారు. మేడిగడ్డలో ఒకటి, రెండు పిల్లర్లు మాత్రమే  కుం గితే రిపేర్ చేయకుండా కుంటిసాకు తో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబుతో రేవంత్‌కు వి డదీయరాని బంధం ఉందని ఎద్దేవా చేశారు. ఆయన పంపినవారే సలహాదారులుగా ఉన్నారంటే  గురుభక్తి ఏంటో అర్థమవుతుందన్నారు.