calender_icon.png 17 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి

17-07-2025 01:18:18 AM

- బీసీ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తేవాలి 

- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): వివాదాలు లేకుండా రిజర్వే షన్లు పెంచే అవకాశం ఉండగా ప్ర భుత్వం కావాలనే న్యాయ చిక్కులను కొని తెచ్చుకుంటోందని మాజీమం త్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బి ల్లు పెండింగ్‌లో ఉండగా ఆర్డినెన్స్ తేవడం మోసం తప్ప మరొకటి కాద న్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెం టు సమావేశాలు జరుగుతున్నందు న ఢిల్లీకి అఖిలప క్షాన్ని తీసుకెళ్లి బీసీ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా స మావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలకు చట్టబద్ధంగా 42 శా తం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. తొందర పడి తప్పుడు మార్గంలో వెళితే అది బీసీల పాలిట ద్రోహం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌పై ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అంటున్నారని, కోర్టులకు వెళ్లకుండా ఎవరినీ ఆపగలమన్నారు.

ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపడం దురదృష్టకరమన్నారు. ఆ ర్డినెన్స్ పంపే ముందు న్యాయ కోవిదులు, బీసీ నాయకుల సలహాలు తీసుకోరా అని, రాష్ర్టపతి కి బిల్లు పంపి ఒక్కసారైనా ఆమోదించాలని కలిసి అడిగారా అని ప్రశ్నిం చారు. తమిళనాడు తరహాలో తొ మ్మిదో షెడ్యూల్‌లో రిజర్వేషన్లను చేర్చడం తప్ప మరోమార్గం లేదన్నా రు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మం త్రి శ్రీహరికి రె వెన్యూ శాఖ, బీసీలకు కీలక శాఖలు ఇవ్వాలని  సూచించా రు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మా ట్లాడుతూ బీసీల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాటం చేస్తే తమ పార్టీ  సహకరిస్తుందన్నారు.