20 July, 2026 | 8:40 PM

నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..

20-07-2026 02:00 AM
  1. మా పాలనలో ప్రజలు కేంద్రంగా అభివృద్ధి చేశాం..
  2. మీ అభివృద్ధి రియల్ ఎస్టేట్ వెంచర్‌లోనే మున్సిపల్ మాజీ చైర్మన్

నల్లగొండ టౌన్, జులై 19 :నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నల్గొండ అభివృద్ధి చేయలేదని నల్లగొండ నగర మేయర్ చేసిన ఆరోపణలు వస్తవ o లేదని మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్ సహకారంతో నల్గొండలో అభివృద్ధి ప్రజ లు కేంద్రంగా చేశామని వివరించారు. నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం 2 నెలల క్రితం పూర్తి కాగా నేటి వరకు ప్రారంభించకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయి బాధిత కుటుంబా లు విడిన పడుతున్నా..

మానవత్వం నైతిక విలువలు లేకుండా ఆరోపణ చేయడం తగదన్నారు.ప్రజా సమస్యపై భూపాల్ రెడ్డి చేసిన ధర్నాపై పోలీసులతో డాడీ చేయించారని ఆరోపించారు. జీవో ఆర్టీ నెంబర్ 762 తేది 29-09-2023 ద్వారా 216 కోట్లతో చేపట్టిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, 36 కోట్ల తో ఎన్జీ కళాశాల, పానగల్ ట్యాంక్ బండ్ సుందరీకరణ, శిల్పారామం, కళాభారతి నిధులు అన్నీ మేము తెచ్చినవేనని తెలిపారు. ఐటీ మంత్రిగా కోమటిరెడ్డి ఉండి ఐటీ టవర్ తేలేకపోయారని, తెచ్చిన టవర్ను నిరుపయోగంగా ఉంచారని, మెడికల్ కళాశాలకు నిధులు తెచ్చినట్లు జీవో చూపించాలని, బత్తాయి మార్కెట్ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. 6 కోట్లతో నిర్మించిన ఆర్&బి గెస్ట్ హౌస్ను స్వార్థంతో క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని,

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లలో కార్పొరేషన్ నిధులతో రోడ్లు వేయించారని ఆరోపించారు.23 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి, 5 ఏళ్లలో మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము ప్రజలు కేంద్రంగా మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్, పట్టణంలో రోడ్ల విస్తరణ, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించామన్నారు. కార్పొరేషన్లోని అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు.రాబోయే రెండేళ్లలో ప్రజల ఆదరణతో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అయన ధీమా వ్యక్తం చేశారు.