5 August, 2026 | 2:41 AM

నిబద్దతకు నిదర్శనం ఆరేపల్లి సర్పంచ్

05-08-2026 01:32 AM

స్వయంగా చెత్త ట్రాక్టర్ నడుపుతూ చెత్త సేకరించిన వైనం

నిజాంసాగర్ ఆగష్టు 4 (విజయ క్రాంతి): పదవి రాగానే దర్పణం ప్రదర్శించే నేటి రోజుల్లో తన ధర్మాన్ని కోల్పోకుండా నిబద్ధతతోసర్పంచ్ ట్రాక్టర్ నడిపి చెత్త సేకరించిన సంఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్  నందాస్ మోహన్  తన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యంతో విధుల్లోకి రాకపోవడంతో  తానే చిత్త ట్రాక్టర్ నడిపి గ్రామంలో చెత్తను సేకరించారు. దర్పణానికి పోకుండా సర్పంచ్ స్వయంగా చెత్తను సేకరించడంతో గ్రామస్తులు అభినందించారు.