సవాళ్లను ఎదుర్కొంటేనే లక్ష్యాలను చేరుకోగలం
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్నగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం మహబూబ్నగర్లోని పి.ఎం. శ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
పాఠశాలలో నెలకొల్పిన క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యా సంస్కృతి, విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం తనను ఎంతో ఆకట్టుకున్నాయని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరుస్తూ ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు వై. సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






