అర్జెంటీనా అద్భుతః
క్వార్టర్ ఫైనల్లో మెస్సీ టీం
అట్లాంటా, జూలై 7 : ఆట 79 నిమిషాలు అయిపోయింది... ఈజిప్ట్ 2 గోల్స్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇలాంటి మ్యాచ్‌లో గెలవాలంటే 11 నిమిషాల్లో అద్భుతం జరగాలి. అలాంటి అద్భుతమే అర్జెంటీనా చేసింది. తమను ఛాంపియన్ టీం అని ఎందుకంటారో మరోసారి రుజువు చేసింది. చివరి 11 నిమిషాల్లో 3 గోల్స్ చేసి ఈజిప్ట్‌ను నిలువరించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఫేవరెట్‌గానే కనిపించినా ఈజిప్ట్ పోరాటం అద్భుతం. 15వ నిమిషంలో ఇబ్రహీం, 67వ నిమిషంలో మొస్తాఫా గోల్స్ చేయడంతో ఈజిప్ట్ 2 ఆధిక్యంలో నిలిచి గెలిచేలా కనిపించింది. అయితే రోమెరో 79వ నిమిషంలోనూ, మెస్సీ 83వ నిమిషంలోనూ గోల్స్ సాధించి స్కోరు సమం చేశారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఫెర్నాండెజ్ గోల్ కొట్టడంతో అర్జెంటీనా 3 గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.






