calender_icon.png 12 July, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

07-08-2024 02:20:15 PM

రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు అస్వస్థత గురయ్యారు. డీహైడ్రేషన్‌ కారణంగా స్పృహ కోల్పోవడంతో భారత అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్‌ చేసినట్లు సమాచారం. రాత్రంతా స్కిప్పింగ్‌, సైక్లింగ్‌, జాగింగ్‌ చేసి రాత్రే కేజీకి పైగా వినేశ్‌ ఫోగట్‌ బరువు తగ్గారు. అదృష్టాన్ని ఆశ్చర్యపరిచే విధంగా, వినేష్ ఫోగాట్ తన మహిళల 50 కేజీల ఫైనల్‌కు ముందు అధిక బరువు ఉన్నట్లు గుర్తించినందున బుధవారంఒలింపిక్స్ నుంచి అనర్హులయ్యారు. స్వర్ణానికి దగ్గరగా వచ్చిన కొన్ని గంటల్లోనే ఆమె పతకాన్ని కోల్పోయింది. వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటం దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫైనల్ పోరుకు నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.