10 August, 2026 | 2:56 AM

అల్లాపూర్‌లో మైకుల ఏర్పాటు

10-08-2026 01:57 AM

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ అంకెన్‌పల్లి నారాయణ

మునిపల్లి, ఆగస్టు9 (విజయక్రాంతి): మండలంలోని అల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అంకెన్ పల్లి నారాయణ తన సొంత డబ్బులతో మైకుల ఏర్పాటు చేసి వారెవా అనిపించుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం గ్రామంలో గల్లీగల్లీలో మైకులు ఏర్పాటు చేసి గ్రామంలో ఏ కార్యక్రమమైనా.. గ్రామ సభ  నిర్వహిస్తే..  పాలకవర్గంతో పాటు గ్రామ పెద్దలకు తెలుస్తుంది.. కానీ గ్రామంలో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరికి తెలియలంటే మైకుల ఏర్పాటుతో సాధ్యమవుతుందని అనుకున్నాడేమో గ్రామ సర్పంచ్ అందుకే పురవీధుల గుండా మైకులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. అలాగే గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా.. గ్రామంలో అందరికి తెలిసేలా చూడాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాబు సాబ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.