యువత రాజకీయాల్లో రాణించాలి
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మక్ అజయ్
జవహర్ నగర్, ఆగస్టు 9 ,(విజయక్రాం తి): యువతే దేశానికి భవిష్యత్తు అని ము ఖ్యంగా యువత ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో రాణించాలని... కాక్రోచ్ సమూహ మే దీనికి ఉదాహరణ అని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ అజయ్ పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఘనంగా యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజి గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొ మ్మక్ అజయ్,
నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తోటకూర రాహుల్ యాదవ్ తదితరు లు హాజరై జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం యూత్ కాంగ్రెస్ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను రాజకీయాల్లో భా గస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులకు సూచించారు. యువతే దేశానికి భవిష్యత్తు అని ప్రజాస్వామ్య పరిరక్షణ తో పాటు సామాజిక న్యాయం అభివృద్ధి కో సం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు.






