01-01-2026 12:40:56 AM
ఎర్రుపాలెం డిసెంబర్ 31 (విజయక్రాంతి): కొత్త సంవత్సరంలో జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించడానికి వచ్చే భక్తులకు సకల ఏర్పాటు చేసినట్లు దేవ స్థానం ఈవో కే జగన్ మోహన్ రా వు తెలియజేశారు. నూతన సంవత్సరం 2026 జనవరి 1న మండలం లోని వివిధ గ్రామాల నుండి, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామినీ దర్శనానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు.
దేవస్థానంలో వివిధ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ ల ద్వారా శీఘ్రంగా స్వామివారిని దర్శించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఉండేందుకు క్యూలైన్లను ను ఏర్పాటు చేసినట్టు ఈవో కే జగన్ మోహన్ రావు తెలియజేశారు. దేవస్థానంలో ఎస్త్స్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షించనున్నారు.