ధాన్యాన్ని వేగంగా తరలించడానికి ఏర్పాట్లు
28-05-2026 12:00 AM
తాడ్వాయి,మే, 27( విజయ క్రాంతి ): ధాన్యాన్ని వేగంగా తరలించడానికి ఏర్పాటు చేస్తామని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి శివారులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షానికి రైతుల ధాన్యం బస్తాలు తడిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మైపాల్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






