ముస్లిం కుటుంబాలకు గొర్రె మాంసం ఉచితంగా పంపిణీ
బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్
సికింద్రాబాద్, మే27 (విజయ క్రాంతి): బక్రీద్ ను పురస్కరించుకొని న్యూ బోయిన్ పల్లి పింఛన్ లైన్ లోని అజ్వ ఎగ్జాటిక్ ఫామ్ అధినేత మొహమ్మద్ షకీబ్ షరీఫ్ బస్తీలోని 500 పేద ముస్లిం కుటుంబాలకు కుర్బానీ కి సంబంధించిన గొర్రె మాంసాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండడం అభినందనీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. మహమ్మద్ షాకీబ్ షరీఫ్ బక్రీద్ ను పురస్కరించుకొని ఈసారి తన ఫామ్ లో పెంచిన కర్ణాటకకు సంబంధించిన మేలు రకం జాతి గొర్రెలు స్థానికులకు ఆకట్టుకుంటున్నాయి.
ఈ మేరకు జంపన్న ప్రతాప్ అజ్వా ఎక్జాటిక్ ఫామ్ సందర్శించి గొర్రెల ప్రత్యేకతలను తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారూ 15 కేజీల వరకు ఉండే ఒక్కో గొర్రె కర్ణాటకలో లక్ష రూపాయలకు పైగాని విక్రయించబడుతుందని తెలిపారు. ఇలా లక్షల రూపాయలను విచ్చించి షకీబ్ షరీఫ్ పేద కుటుంబాలకు మాంసాన్ని పంపిణీ చేసి,వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతుండడం సంతోషకరమని ప్రతాప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మౌల, ఫాహద్,సాజిద్,నజీర్, పైసల్,హర్షది తదితరులు పాల్గొన్నారు.






