కేటీఆర్ సభకు భారీ ఏర్పాట్లు
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా
ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): ముషీరాబాద్ లోని కశిష్ హాల్లో ఈ నెల 30న నిర్వహించే బీఆర్‌ఎస్ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ తెలిపారు. బుధవారం కేటీఆర్ హాజరయ్యే సభా ప్రాంగనాన్ని ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ముఠా జైసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రతలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలు, కళాప్రదర్శనలతో పాటు ప్లెక్సీబోర్డులు, తోరణాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠాగో పాల్ సారధ్యంలో కొనసాగే బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేసేందుకు డివిజన్ల వారిగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భోలక్ పూర్, కవాడిగూడ, అడిక్మెట్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, వల్లాల శ్యామాయాదవ్, పార్టీ సీనియర్ నాయకులు రాజా దీన్ దయాల్‌రెడ్డి, కె. మాధవ్, శ్యామ్ సుందర్, కృష్ణ, సాయి చాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






