calender_icon.png 14 January, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా దర్బార్‌కు మంత్రుల రాక

14-01-2026 01:00:34 AM

కలెక్టర్ రాజర్శి షా

నాగోబా జాతరను విజయవంతంగా నిర్వహిస్తాం

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, జనవరి 13 (విజయక్రాంతి): దేశంలో ఆదివాసులు నిర్వహించుకునే జాతరాలలో  అతిపెద్ద 2వ జాతరగా.... రాష్ట్ర పండు గగా  గుర్తింపు పొందిన ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు నాగోబా జాతర లో ఈసారి నిర్వహించే ప్రజా దర్బార్‌కు ఆరుగురు మం త్రులు హాజరవుతున్నారని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. నాగో బా జాతర ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్  అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారా వు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మ ణకుమార్, దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క లు హాజరవుతారని అన్నారు.

నాగోబా ఆలయ అభివృద్ధికి  తనవంతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి  రూ. 22 కోట్లతో అబివృద్ధి పనులతో ప్రతిపాదన అందించాలని తెలిపారు.. రూ. 22 కోట్లు మంజూరు అయితే నాగోబా ఆలయ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయ ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాగోబా జాతరకు వచ్చే భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నాలుగు వైపులా బైపాస్ రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సూచనలు చేశారు. నాగోబా జాతర సందర్భంగా గిరిజనుల నుంచి స్వీకరించి అర్జీలను పరిశీలించి ఎంత వరకు న్యాయం చేశామన్న విషయాన్ని ఈసారి వివరించవలసి ఉందని గుర్తు చేశారు. కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ.... నాగోబా జాతర సందర్భంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా కళా ప్రదర్శన నిర్వహించాలని అధికారులకు సూచించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఇతర రాష్ట్రాల గిరిజన కళాకారులను జాతరకు పిలిపించి, వారిచే సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఐటిడిఏ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులకు అప్పగించే పనులు గైరాజరైతే  అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటామని గుర్తు చేశారు..  ఎస్పీ అఖిల్  మహాజన్ మాట్లాడుతూ   భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. జాతరకు వచ్చే విఐపి లకు ఇన్కర్ గూడా నుంచి దుర్వాగుడా మీదుగా నాగోబా ఆలయానికి తీసుకువచ్చే మార్గాన్ని గుర్తించామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఆల య పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, సర్పంచ్ మెస్రం తుకారం, జిల్లా ఉన్నతాధికారులు, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.