calender_icon.png 14 January, 2026 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రాక

14-01-2026 01:01:57 AM

చనాక- బ్యారేజ్ పంప్ హౌస్ మెన్ కేనాల్ ద్వారా నీటి విడుదల

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ఆదిలాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించానున్నారు. సీఎం తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం భోరజ్ మండలంలోని హాత్తి ఘాట్ గ్రామంలోని చనాకకోరాట బ్యారేజీ పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అంతకుముందు కలెక్టర్, ఎస్పీలు సీఎం హెలిపాడ్ ప్రాంతాన్ని, పంప్ హౌస్, ప్రధాన కాలువ, ప్రధాన కాలువ డెలివరీ సిస్టమ్ (ౄC) వద్ద జరగబోయే పూజా కార్యక్రమ ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచ నలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చనాక-కోరాట బ్యారేజ్ ప్రారంభో త్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతు న్నందున ఎటువంటి లోపాలు లేకుండా పటి ష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రతా, ప్రోటోకాల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిపాడ్ వద్ద అగ్నిమాపక, వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నా రు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ... భద్రత కారణాల దృష్ట్యా గుర్తింపు కార్డులతో పాటు పాస్ లు ఉన్న వారిని అనుమతించడం జరుగుతుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయ డం జరుగుతుందన్నారు. అందుకు గ్రామస్తులు, అధికారులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజే శ్వర్, ఆర్డీఓ స్రవంతి, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ విశ్వ కళ్యాణ్, తహసీల్దార్లు రాజేశ్వరి, శ్రీనివాస్, ఇంజనీర్లు, అగ్ని మాపక, వైద్య, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.