21-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 20: నార్కట్ పల్లి మండల పరిధిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో ఈనెల 23 నుండి 30 వరకు జరగనున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు అందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా డిఎస్పి శివరాంరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, దూర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని, ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రత చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నార్కట్ పల్లి సీఐ కే. నాగరాజు, నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, చండూరు సిఐ ఆదిరెడ్డి, నార్కట్ పల్లి ఎస్త్స్ర విష్ణుమూర్తి, చెరువుగట్టు కార్యనిర్వాహణ అధికారి శోభన్ బాబు ఏఈ , దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.