మన పురాణాల్లోనూ అరుణాచల్
డా. కావలి చెన్నయ్య :
మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్/ జాంగ్నాన్ ప్రావిన్స్ అని ఈ మధ్య చైనా అంటున్నది. ఆ ప్రాంతంలోని 15 పర్వతాలు, 5 నివాస ప్రాంతాలు, 4 కనుమలు, 2 నదులు, ఒక సరస్సు సహా పలు ప్రాంతాలకు పేర్లు పెడుతూ ఒక జాబితాను విడుదల చేసింది.
దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమని, ఇలాం టి తప్పుడు చర్యలు వాస్తవాలను మార్చజాలవని స్పష్టం చేసింది. ఇలాంటి కవ్వింపు చర్యలు 2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత మళ్లీ మొదలయ్యాయి.
బ్రిటిష్ ఇండియాతో సంబంధాలు:
1904లో టిబెట్‌ను రష్యా నుంచి కాపాడటానికి లాసాలో కుదిరిన ఆంగ్లో- టిబెట న్ ఒప్పందంతో చైనా కలవరపాటుకు గు రైంది. టిబెట్ తిరుగుబాట్లను అణచివేసి టిబెట్‌లో బాగమని చెబుతూ నేటి అరుణాచల్ లోహిత్ లోయలో సరిహద్దు రాళ్లను, జెండాలను పాతింది. 1910 నాటికి బ్రిటిష్ ఇండియా వాటిని తొలగించింది. ఇలాంటి పరిస్థితి సృష్టించి భవిష్యత్తులో అరుణాచల్‌లోని తవాంగ్‌ను చైనా ఆక్రమించొచ్చని బ్రిటిష్ ఇండియా నాడే భావించింది.
సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు సిమ్లా లో చైనాతో పాటు టిబెట్‌ను కూడా కూర్చోబెట్టింది నాటి బ్రిటిష్ ఇండియా సర్కార్. అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి హెన్రీ మెక్‌మోహన్ సర్వే చేసి టిబెట్, బ్రిటిష్ ఇండియా, చైనా మధ్యన నియంత్ర ణ రేఖను నిర్ణయించారు. కానీ, ప్రతిపాదిత సరిహద్దును చైనా గుర్తించలేదు. ఫలితంగా టిబెట్‌తో చర్చలు జరిపి సరిహద్దు నిర్ణయించాలని భావించారు.
ప్రాచీన కాలం నుంచి హిమాలయాలు తమకు ఉత్తర సరిహద్దులు కనుక, ఆధునిక కాలంలో కూడా అదే సరిహద్దు ఉండాలని భారత్ కోరుకుంది. కానీ, హిమాలయాల్లోని వివాదాస్పద ప్రాంతమంతా టిబెట్‌కు చెందుతుందని, చైనాలో టిబెట్ అంతర్భాగమని, సరిహద్దు ఒప్పందాలు చేసుకునే స్వతంత్రం టిబెట్‌కు లేదని చైనా వాదించింది. తవాంగ్ అనే వాణిజ్య పట్టణాన్ని సరిహద్దుగా గుర్తించడం మినహా మెక్‌మోహన్ రేఖలోని ఏ విభాగానికి అ భ్యంతరం చెప్పలేదు.
ఈ రేఖ తవాంగ్‌ను బ్రిటిష్ ఇండియా పరిధిలోకి తెచ్చింది. రెం డో ప్రపంచ యుద్ధం వరకు టిబెట్ అధికారులకు తవాంగ్‌ను పాలించడానికి అనుమ తిచ్చారు. ఆ కాలంలో చైనా, జపాన్ విస్తరణ ముప్పు పెరగడంతో భారత తూర్పు సరిహద్దు రక్షణలో భాగంగా బ్రిటిష్ ఇండియా బలగాలు తవాంగ్‌కు రక్షణనిచ్చాయి.
స్వాతంత్య్రానంతర సంబంధాలు:
1950లో భారత్ ఈ ప్రాంతంలో గస్తీ ప్రారంభించింది. ఎత్తున పర్వత శ్రేణులు ఇండియా, టిబెట్/చైనాలను వేరుచేయడమే మెక్‌మోహన్ రేఖ చారిత్రక ఉద్దేశమని భావించి, తన ముందస్తు కాపలా పోస్టులను ఉత్తరం వైపు శిఖరాల వరకు విస్తరించింది. 1956-57లో చైనా అక్సాయ్‌చిన్ జిన్జియంగ్, టిబెట్‌ను కలుపుతూ రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు చాలా చోట్ల జాన్సన్ లైనుకు దక్షిణం గా సాగింది. భౌగోళికంగా అక్సాయ్‌చిన్ చైనాకు అనుకూల ప్రాంతం కానీ భారతదేశ ప్రవేశానికి కారాకోరం కొండలు దాటి ప్రవేశించాలి.
కాబట్టి, 1958లో విడుదల చేసిన చైనా మ్యాపు చూసినప్పుడు చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ గుర్తించింది. అప్పటినుంచి అక్సాయ్‌చిన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. 1954 ఏప్రిల్ 29న భారత్, చైనా ప్రధానులు నెహ్రూ, చౌ ఎన్‌లై సంతకాలు చేసి చారిత్రాత్మక పంచశీల ఒప్పందాన్ని కదుర్చుకున్నారు.
1950 అక్టోబర్‌లో టిటెట్‌ను చైనా ఆన ఆధీనంలోకి తీసుకున్నది. అక్కడ చైనా నిర్బంధం, మానవ హక్కుల అణచివేతకు నిరసనగా 1959లో టిబెటన్ల తిరుగుబాటు జరిగింది. 14వ దలైలామా తెన్జిన్ గ్యాత్సో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ బౌద్ధాశ్రమంలో కొంతకాలం ఆశ్రయం పొందారు.
ఆ తర్వాత 1962లో చైనా పంచశీల ఒప్పందాన్ని కాలరాసి భారత్‌పై యుద్ధానికి దిగింది. అకస్మాత్తుగా దాడి చేసి అరుణాచల్ ప్రదేశ్‌లో కొంత ఆక్రమించింది. ఏకపక్షంగా కాల్పుల విరమణ చేసి అక్సాయ్ చిన్‌ను కబంధహస్తాల్లో బంధించి, ఆక్రమిత అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెనక్కి వెళ్లింది.
హిందూ పురాణాల ప్రకారం:
హిందూ పురాణ గాథల ప్రకారం వ్యాస మహర్షి ప్రదేశం, భీష్మ రాజు తన రాజ్యాన్ని స్థాపించిన ప్రదేశం, రుక్మిణిని కృష్ణుడు వివాహం చేసుకున్న ప్రదేశం అరుణాచల్ ప్రాంతమే. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో లోహిత్ నది దిగువ ప్రాం తమైన బ్రహ్మపుత్ర పీఠభూమిపై శ్రీమహా విష్ణువు 6వ అవతారమైన పరుశురాముడి పరశురామ్ కుండ్ ఉంది. తన తల్లి రేణుక శిరచ్ఛేదనం చేసిన తర్వా త మహామునుల సలహా మేరకు పరశురాముడు లోహిత్ నదిలో స్నానం చేసి, తల్లిని చంపిన పాపాన్ని కడిగేసుకున్నాడని, ఫలితంగా ఆయన గండ్రగొడ్డలి వేరు అయిందని భక్తుల విశ్వాసం. రేణుకా మందిరం, దశావతార ఆలయం, మాలిని( పార్వతీదేవి) ఆలయాలు కూడా ఇక్కడున్నాయి.
తవాంగ్ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. క్రీ.శ. 1489లో ఉర్లెన్ సాంగ్ పో నిర్మించిన ఉర్గెల్లింగ్ మఠం, 6వ దలైలామా త్సాంగ్యాంగ్ గ్యాత్సో జన్మస్థలం ఇది. నాటి టిబెట్, బ్రిటి ష్ ఇండియా మధ్య సరిహద్దు మెక్‌మోహన్ రేఖ ప్రకారం 890 కిలోమీటర్లు తవాంగ్, ఇతర ప్రాంతాలు సిమ్లా ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఇండియాలో ఉంచారు. ఒప్పంద అమలుకు టిబెట్, చైనా కూడా అంగీకరించాలని షరతు పెట్టింది. ఆ షరతు ఈనాడు చైనాకు తిరుగులేని ఆయుధమై నేటికీ చైనా సిమ్లా ఒప్పందాన్ని అంగీకరించలేదు. బౌద్ధ వారసత్వ సంబంధాల దృష్ట్యా తవాంగ్‌తో పాటు దాని పరిసర ప్రాంతాలు టిబెట్ పాలన కింద ఉండేవి.
1951 ఫిబ్రవరిలో భారత్ మణిపూర్‌కు చెందిన రాలెంగ్నావో ఖాతింగ్‌ను ఒక చిన్న రక్షక దళం, కొన్ని వందల మంది కూలీలతో కలిపి తవాంగ్‌కు పంపి, టిబెటన్ల నుంచి తవాంగ్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాల ను ఆధీనంలోకి తీసుకొని టిబెట్ పరిపాలనను తొలగించారు. 2003 వరకు భారత్ లోని ధర్మశాలలో ఆశ్రయం పొందిన 14వ దలైలామా అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని అన్నారు. కానీ, ఆ తర్వాత నాటి బ్రిటిష్ ఇండియా, టిబెట్ల మధ్య 1914లో మెక్‌మోహన్ రేఖను గుర్తించాయని, దాని ప్రకారం భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ భాగమని 2008లో అంగీకరించారు.
మానవ చరిత్ర ప్రధానంగా రాజకీయ, దౌత్య, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, మే ధోపరమైన 6 రకాల ప్రధానమైన అంశాలు ఒక ప్రాంత చరిత్రను తెలియజేస్తాయి. భారత్‌లో అరుణాచల్ అంతర్భాగమని చెప్పేం దుకు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చైనా చాలాకాలంగా తవాంగ్ తమ దే శంలో భాగమని వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తోంది. భారత్ ఎప్పటికప్పుడు చైనా వాద నలను వివిధ వేదికలపై దీటుగా ఖండిస్తూ వస్తున్నది.
వ్యాసకర్త సెల్: 9000481768






