21 April, 2026 | 2:43 AM

మహనీయుడు బసవేశ్వరుడు

21-04-2026 01:31 AM

ఆయన స్ఫూర్తితో మా పార్టీలో సామాజిక న్యాయానికి పెద్దపీట

33 శాతం టికెట్లు, పార్టీ పదవులు మహిళలకే ఇస్తాం

తెలంగాణ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత

ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మహాత్మ బసవేశ్వరుడు 893 ఏళ్ల క్రితమే సామాజిక సమానత్వం, లింగ వర్ణ, కులభేదాలు లేకుం డా సమ సమాజ స్థాపనకోసం కృషి చేసిన మహనీయుడని పలువురు వక్తలు కొనియాడారు. మహాత్మ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకొని నేటి పాలకులు ముందుకు సాగుతున్నారని వారు పేర్కొన్నారు.

మహాత్మ బసవేశ్వరుడి 893 జయం తి ఉత్సవాలలో భాగంగా సోమవారం ట్యాంక్ బండ్ పై ఉన్న బసవేశ్వరుడి విగ్రహం వీరశైవ సమాజం సికింద్రాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలకు తెలంగాణ జాగృతి ఆధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు తోపాటు వీరవైశ సమాజం సికింద్రాబాద్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ త్వరలో తాము నూతనంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని, బసవేశ్వరుడి స్ఫూర్తితోనే సామా జిక న్యాయం కోసం పనిచేస్తుందని ఆమె వివరించారు. కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా సమా నత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని, ఆయ న చెప్పిన సమానత్వం సమాన అవకాశాల కోసం మనం ఈ రోజు పాటుపడుతున్నాం అంటే మ నం వెనకబడి ఉన్నట్లు లెక్క అన్నారు.

బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలను తీసు కొచ్చిన మార్పులు గొప్పవి కాబట్టే ఈ రోజు ఆయనను స్మరించుకుంటున్నామన్నారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తి పొందారని, అదే స్ఫూర్తితో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు మహిళలకే ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని బిల్లు పాసైతే బాగుండేదని ఆమె అభిప్రాయ పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు 8 సీట్లు కేటాయిస్తే, మరోపార్టీ పదిసీట్లు మాత్రమే కేటాయించిందని దీంతో అసెంబ్లీ మొత్తంలో కేవలం18 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవైశ సమాజం సికింద్రాబాద్ ప్రధాన ప్రదాన కార్యదర్శి కోట గుండప్ప, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, సతీష్ వీరశైవ లింగాయత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.