ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న అరుంధతీ రాయ్
28-06-2024 01:21 AM
న్యూఢిల్లీ జూన్ 27: ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీరాయ్ ప్రతిష్ఠాత్మక ‘పెన్ పింటర్’ అవార్డు గెలుచుకున్నారు. 14 ఏళ్ల క్రితం కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల గురించి ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేసిన తర్వాత రెండు వారాలకు ఆమెకు ఈ అవార్డు దక్కడం విశేషం. ఏటా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును గెలుచుకోవడంతో అరుంధతీ రాయ్‌ని ప్రశంసిస్తు న్నారు. ఆమె 1997లో రాసిన “గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’కు బుకర్ ప్రైజ్ అవార్డు గెలుచుకుంది. 2024 జూన్ ౧౪న మోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఆమె మీద ఉగ్రవాద నిరోధక చట్టాల ప్రకారం విచారణకు ఆదేశించారు. 2010లో ఆమె కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






