వర్షం కురిసే.. రైతు మురిసే
పంటలకు ప్రాణం పోసిన వర్షాలు
నిర్మల్ జులై 21 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండు రో జులుగా కురిసిన తేరికపాటి వర్షాలు రైతుల పంటలకు జీవం పోశాయి. నిర్మల్ జిల్లాలో ని ఆయా ప్రాంతాల్లో రైతులు పత్తి సోయా మొక్కజొన్న , జొన్న పంటలు వేసుకో గా వారి నార్ల కోసం నార్లు పూసుకున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు కురవకపోవడంతో నిర్మల్ జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్నారని ఈ పంటలు తేమలేక రెండు ముఖం పట్టాయి.
జిల్లాలోని 18 మండలాల్లో పెంబి బైంసా కుంటాల మినహా మిగతా 15 మండలాల్లో 40 శాతం నోటు వర్షపాతం నమోదయింది. దీంతో భూమిలో తీమశాతం లేకపోవడంతో పంట ఎండిపోయి పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన గురి అయ్యారు. వర్షాలు కురిసి పంటలు ఉండాలని రైతులు జిల్లా వ్యాప్తంగా వర్షం కోసం జలాభిషేకాలు కప్పతల్లి ఆటలు భర్త పాశం ఇతర పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది
పంటలకు జీవం
నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా సాధారణ వర్షంతో పాటు ఆకాశం కారు మబ్బులు కొమ్ముకొని ఉండడంతో రైతులు సాగుచేసిన పంటలకు జీవం పోశాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు పత్తి మొక్కజొన్న సోయా ఇతర పంట కలుపుతీత పనులు చేపట్టి రసాయన మందు లను వినియోగిస్తున్నారు.
వాతావరణ కూడా చల్లబడడంతో వర్షాలు కురుస్తాయని భాషతో రైతులు మళ్లీ సాగుపై దృష్టి పెట్టారు. వరి నాళ్ళు పచ్చబడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షాలు భారీ వర్షాలు కురువక సాధారణ వర్షాలు కావడంతో చెరువులు పూట బావుల్లో చేత పంపుల్లో నీరు లేక వరిణాలపై ఇంకా రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం వారి సాగు చేయవద్దని ఆడుతాడు పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.






