జంపన్నవాగుకు భారీగా వరద
22-07-2026 12:04 AM
- కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
- కొండాయి, మల్యాలకు నిలిచిన రాకపోకలు
ములుగు, జూలై 21 (విజయ క్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో కురిసిన వర్షాలకు జంపన్నవాగుకు మంగళవారం భారీగా వరద రావడంతో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు రాలేని పరిస్థితి ఆయా గ్రామాల ప్రజలకు ఏర్పడింది. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






