ఆరోగ్యాన్ని తిరిగి పొందండి
- డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి
ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాం తి): భారతదేశంలో ప్రజల ఆరోగ్యం కోసం ఒక ముఖ్యమైన చర్యగా ప్రసిద్ధ బరువు తగ్గిం చే శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి శనివారం ‘ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, ఊబకాయం (అధిక బరువు) గురించి ఉన్న తప్పు అభిప్రాయాలను తొలగించి, ప్ర జలు ఆరోగ్యంగా మారేందుకు సహాయపడే ఒక శాస్త్రీయ కార్యక్రమం.
ప్రొఫెసర్ అడ్రియన్ కన్నెడీ, డాక్టర్ నదీమ్ వంటి నిపుణు లతో కలిసి, డాక్టర్ దుక్కిపాటి ‘మనసు బలం ఉంటే సరిపోతుంది అనే పాత ఆలోచనను మార్చి వైద్య శాస్త్రం, సరైన జీవనశైలి ద్వారా బరువు తగ్గడం సాధ్యమని ప్రజలకు తెలియజేస్తున్నారు.
కిమ్స్ లివ్ లైఫ్ హాస్పిటల్స్‌లో ఊబకాయం షుగర్ శస్త్రచికిత్స విభా గానికి క్లినికల్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ దుక్కిపాటి.. అధిక బరువు టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు ప్రధాన కారణమని చెపుతున్నారు. కొత్త పోషకాహార పద్ధతులు, సరై న మందులతో చికిత్స, శస్త్రచికిత్స అవగాహనపై అవగాహన కల్పిస్తున్నారు. ‘ఈ కార్యక్ర మం బరువు తగ్గడం గురించే కాదు - అనారోగ్యంతో కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొం దడమే లక్ష్యం అని చెప్పారు.




