19-08-2025 08:03:23 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం తాండూర్ పిహెచ్సి ఎదుట స్థానిక ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ ఒకటిన చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. సీనియార్టీ ప్రకారం ఆశా వర్కర్లను ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని, పెండింగ్ లో ఉన్న పారితోషకాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటవ తారీఖున వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు వేతనం రూ 18000 చెల్లించాలని కోరారు.