calender_icon.png 19 August, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇంచార్జ్ మంత్రి జూపల్లిని కలిసిన బోథ్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులు

19-08-2025 08:07:55 PM

బోథ్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిశారు. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కు నష్టపోయిన పంటలను, ఇళ్లను పరిశీలించడానికి మంగళవారం జిల్లాకు వచ్చిన మంత్రిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ పార్టీ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. బోథ్ నియోజకవర్గంలో తాజా పరిస్థితులపై జిల్లా ఇన్చార్జి మంత్రికి నియోజకవర్గలో జరికిన నష్టాన్ని వినతిపత్రం అందజేశారు. బోథ్ నియోజకవర్గంలో చాలా మేరకు రైతులు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ తెలిపారు.