19-08-2025 08:15:59 PM
కరీంనగర్,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాస్ఫూర్తిని అలవర్చుకొని కొనసాగించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సామాజిక సేవ రంగంలో విశిష్ట సేవలు అందించిన పెండ్యాల శశిధర్ రెడ్డికి నమో మిషన్ వందేమాతరం సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల శశిధర్ రెడ్డిని నియమిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వీర మద్విరాజ్ ఆచారి సీపెళ్లి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెండ్యాల శశిధర్ రెడ్డికి ధ్రువపత్రం అందించి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... మన సమాజంలో సేవా తత్వంతో, అంకితభావంతో కృషి చేసిన పెండ్యాల శశిధర్ రెడ్డిని సన్మానించడం మనందరికీ గర్వకారణం అన్నారు సామాజిక సేవ అనేది కేవలం మాటల్లో కాదు, మనసు కలిసిన చేతలతోనే సాధ్యం.పేదలకు, అనాధలకు, విద్య లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు, వైద్య సదుపాయం అందని బలహీన వర్గాల వారికి తోడ్పాటు అందించడం ద్వార పెండ్యాల శశిధర్ రెడ్డి సమాజానికి ఒక దీపస్తంభం లా నిలిచారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ కృషిని గుర్తించి నమో మిషన్ వందేమాతరం సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శశిధర్ రెడ్డిని నియమించడం అవార్డు రూపంలో సత్కరించడం గొప్ప విషయమని అన్నారు. ఒక వ్యక్తి కృషి వందల మందికి ఆశ వెలిగించగలదని ఈ అవార్డు నియామకం నిరూపిస్తోంది అని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు