calender_icon.png 20 August, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి

19-08-2025 08:49:50 PM

ఖానాపూర్: పాఠశాలలో అభ్యాసన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. కడెం మండలంలోని అంబర్ పేట ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల యొక్క బోధన డైరీ లను తనిఖీ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు బోధన డైరీలు రాయాలని పాఠ్య ప్రణాళిక ప్రకారం తరగతులు బోధించాలని, అన్ని తరగతులకు అభ్యసనా కార్యక్రమాలు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సూచించారు.

అలాగే ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఎప్ఆర్ఎస్ హాజరు, బేస్లైన్ పరీక్షలు నిర్వహించడం,  అన్ని వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడం,  పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థులకు శుభ్రమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం మొదలు అంశాల గురించి వివరించారు.