19-08-2025 08:46:58 PM
రేగొండ,(విజయక్రాంతి): కల్తీ బీరుతో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తారా అంటూ బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జరిగింది.బాధితుడి వివరాల ప్రకారం.. మండలంలోని బాగిర్తి పేట గ్రామానికి చెందిన దుగ్యాల స్వామి అదే గ్రామానికి చెందిన శ్రీపతి సంతోష్ బెల్ట్ షాపులో కింగ్ ఫిషర్ లైట్ బీరు ను కొనుగోలు చేసి సేవించగా వాంతులు, విరేచనాలు అయ్యాయి.
దీంతో బాధితుడు స్వామి బెల్ట్ షాప్ యజమానిని నిలదీయగా మాకేం సంబంధం లేదు వైన్స్ షాప్ యజమానులను అడగాలని చెప్పడంతో బాధితుడు కల్తీ బీరు సీసాతో మండల కేంద్రంలోని వైన్స్ షాప్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. దీంతో మందు ప్రియులు బాధితుడు స్వామికి అండగా నిలిచి మాట్లాడారు. చాలా కాలం నుండి బీర్ సీసాలు కల్తీ వస్తున్నాయని వైన్స్ యజమానులకు చెప్పినా తీరు మారక పోగా యజమానుల నుండి బెదిరింపు మాటలు వస్తున్నాయని మండిపడ్డారు.
కల్తీ మద్యంతో మందు ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు.బాధితుడు దుగ్యాల స్వామి కల్తీ బీరు సీసా సేవించడంతోనే నాకు వాంతులు విరేచనాలు అయ్యాయని ఇదేంటని వైన్స్ యజమాలను ప్రశ్నిస్తే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.