మేడ్చల్‌లో ఆశా వర్కర్ల రాస్తారోకో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
మేడ్చల్ అర్బన్, మార్చి 31 (విజయక్రాంతి): అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు మేడ్చల్లో రాస్తారోకో చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్ల చలో హైదరాబాద్ సందర్భంగా ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని వారు తెలిపారు. అధికారంలోకి రాగానే తమకు 18 వేల రూపాయల వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని తెలిపారు.
పోరాటాలను అణచివేసిన గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని వారు అన్నారు. తమ సమస్యల పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్, పద్మ, వసంత, కృష్ణవేణి, కల్పన, మాధవి, లక్ష్మి, యాదమ్మ, రేణుక, శ్రీదేవి, సునీత, మంజుల తదితరులు పాల్గొన్నారు.




