1 April, 2026 | 2:34 AM

ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్నపంట

01-04-2026 12:41 AM

ఆందోళన చెందుతున్న రైతన్నలు

నిజాంసాగర్ మార్చి 31 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం రాత్రి వీచిన   ఈదురుగాలులకు, వరి,  పంటలు నేలకొరిగాయి. అకాల వర్షాలు ఈదురు గలలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు. పంట నష్టం వివరాలపై మండల వ్యవసాయ అధికారులను వివరణ కోరగా పూర్తిస్థాయిలో పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలను అందిస్తామని వారు తెలిపారు.