10 August, 2026 | 5:01 AM

ఘనంగా ఆషాఢమాస బోనాలు

10-08-2026 12:00 AM

లక్ష్మిదేవిపల్లి, ఆగస్టు 9, (విజయక్రాంతి ): ఆషాఢమాస సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లిలోని శ్రీనగర్ కాలనీ నుండి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకొని శేషగిరినగర్ లోని డప్పు వాయిద్యాల నడుమ మడేలయ్య దేవాలయంలో బోనాలను సమర్పించారు.

మహిళలు అట పాటలకు నృత్యాలు చేస్తూ సంబరంగా బోనాల పండుగను నిర్వహించి రు.  కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, రజక సంఘం  గౌరవ అధ్యక్షులు నేరెళ్ల రమేష్ , కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు సుంకరి అజిత్,  కార్యదర్శి దురిశెట్టి  కుమార్ ,  పట్టణ ఉపాధ్యక్షులు బుసరాజు , జంగంపల్లి  రాజు , సంఘం నాయకులు కొలిపాక సత్యం , రాచర్ల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.