ఏప్రిల్‌లో 13వ ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్
పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి 13వ ఏషియన్ టెక్స్ టైల్ కాన్ఫరెన్సు వచ్చే నెల 2, -3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ఇండస్ట్రీ ప్రతినిధులు, అత్యాధునిక యంత్రాల సరఫరాదారులు, ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు.
మంగళవారం సచివాలయంలో కాన్ఫరెన్స్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సదస్సుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) కో హోస్ట్‌గా వ్యవహరిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, చేనేత, జౌళిశాఖల ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
గత ఏడాది నిర్వహించిన 12వ సదస్సు ముంబైలో జరిగింది. వస్త్ర పరిశ్రమలో అంకుర సంస్థలకు తోడ్పాటును అందించడం, ప్రపంచ వస్త్రరంగం అవసరాలు, ముడి సరుకుల లభ్యత, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లతోపాటు పలు అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.




