సైనికులారా.. భరత మాత సేవకు సిద్ధంకండి
అసోం రైఫిల్స్ శిక్షణ భేష్
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): క్రమశిక్షణతో అద్భుతమైన శిక్షణనిస్తూ శారీరకంగా, -మానసికంగా దృఢమైన సమర్థు లైన సైనికులను తయారు చేయడంలో అసోం రైఫిల్స్ శిక్షణా కేంద్రం పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. ప్రతి సైనికుడు భరత మాత సేవకు సిద్ధంగా ఉండాలన్నారు. నాగాలాండ్‌లోని దిమాపుర రీజియన్ సుఖోవిలోని అసోం రైఫిల్స్ శిక్షణా కేంద్రం పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికుల ప్రమాణ స్వీకార ఉత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజ య్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో 762 మంది శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులు ముక్తకంఠంతో కేంద్ర మంత్రి సమక్షంలో ప్రమాణం చేశారు.
అనంతరం అసోం రైఫిల్స్ నిర్వహించిన పరేడ్ విన్యాసాలను కేంద్ర మం త్రి బండి సంజ య్ తిలకించారు. కేంద్ర మంత్రి మాట్లాడు తూ ప్రతి సైనికుడి విధి దళ గౌరవాన్ని కాపాడాలని, చెడు పేరు రాకుండా భరత మాతకు సేవకు సిద్ధంగా ఉండాలని కోరారు. సైనికులు తమ పనితీరుతో అసోం రైఫిల్స్‌కు మరింత పేరు తీసుకురావాలని కోరారు. పరేడ్ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ అసోం రైఫిల్స్ పరేడ్ మైదానంలో సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శౌర్యస్థల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన జవా న్ల తల్లిదండ్రులతో కలిసి ముచ్చటించారు. వీరిలో పలువురు తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి.




