నాగోల్ సర్కిల్కు బదిలీ అయిన అసిస్టెంట్ సిటీ ప్లానర్
ప్రతాప్‌ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నేతలు
నాగోల్, జూన్ 5 (విజయక్రాంతి) : ఎల్బీనగర్ సర్కిల్‌లో అసిస్టెంట్ సిటీ ప్లానర్గా విధులు నిర్వహించిన ప్రతాప్ నాగోల్ సర్కిల్కు బదిలీ కావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఎల్బీనగర్ సర్కిల్ నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా రామకృష్ణపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పున్న గణేష్ నేత మాట్లాడుతూ, ఎల్బీనగర్ సర్కిల్లో ప్రతాప్ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.
నాగోల్ సర్కిల్లో కూడా అదే అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, జెల్లా జగన్నాథం, ఎల్బీనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు ఇతరులు పాల్గొని ప్రతాప్కు అభినందనలు తెలిపారు. నాగోల్ సర్కిల్లో ఆయన విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.






