6 June, 2026 | 1:32 AM

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

06-06-2026 12:00 AM

బాన్సువాడ, జూన్ 5 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం కోటగిరి మండలం ఎత్తొండ క్యాంపులో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్తు ఉపకేంద్రాన్ని, ఎత్తొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, బాన్సువాడ మండలం సంగోజీపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా మండలి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో, ప్రారంభోత్సవంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, బాన్సువాడ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు  పాల్గొన్నారు.