12-06-2025 12:25:26 AM
ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జూన్ 11విజయ క్రాంతి) మండలం బొంపల్లి గ్రా మంలో శ్రీ. భూగోదా సమేత శ్రీ. రంగనాధస్వామి వారి బ్ర హ్మోత్సవాల సందర్బంగా స్థాని క నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు వేద మంత్రాల సాక్షిగా ఆశీర్వదించి ఘనంగా సన్మానిం చారు.
ముందుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే ఓదెల మండలం, కనగర్తి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల ని ర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రా వు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.