calender_icon.png 24 December, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందమర్రిలో అట్టహాసంగా అథ్లెటిక్ టోర్నమెంట్

24-12-2025 08:28:21 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో మందమర్రి ఏరియా డబ్ల్యూపీఎస్జీఏ ఆధ్వర్యంలో నియర్ బై అథ్లెటిక్స్ టోర్నమెంట్ అట్టహాసంగా చేపట్టారు. బుధవారం ఈ టోర్నమెంట్ ను ముఖ్య అతిథి గా హాజరై సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బొంగు శంకర్, AITUC మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకాలను పరిచయం చేసుకొన్నారు.

అనంతరం క్రీడల ఉద్దేశించి వారు మాట్లాడుతూ సింగరేణి పేరును కోల్ ఇండియా లెవెల్ అథ్లెటిక్స్ లో నిలబెట్టాలని అన్నారు. ప్రతి క్రీడాకారులలో, శ్రమ పట్టుదల ఉన్నాయని, వాటిని మరింత మెరుగు పరిస్తే విజయం ప్రతి ఒక్కరిని వరిస్తుందన్నారు. క్రీడాకారులను క్రీడాకారుల పరిచయ కార్యక్రమం తరువాత జండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి డబ్ల్యూపీఎస్ & జీఏ హానరబుల్ సెక్రటరీ కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.