24-12-2025 08:34:00 PM
రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): నూతన పద్ధతులను అనుసరించి సమీకృత విధానంలో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. చిట్యాల మండలంలో తాళ్ల వెళ్ళాంల గ్రామంలోని రైతు రత్న అవార్డు గ్రహీత పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలోని అరటి, సీతాఫలం, మేకల పెంపకం, ఆయన పరిశీలించి పెంపకం గురించి రైతు అజయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
మేకల పోషణ వ్యవసాయ సాగుకు సంబంధించిన సుస్థిర ఆదాయ విధానాన్ని తెలుసుకొని రైతును అభినందించారు. అనంతరం పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తమ గ్రామానికి ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా నీటి కాలువ పొడిగించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవాని రెడ్డి, వ్యవసాయ శాఖ ఓఎస్డి బి హరి వెంకట ప్రసాద్, చిట్యాల ఏఓ గిరిబాబు, ఇన్చార్జ్ తహసిల్దార్ విజయ, సర్పంచ్ జోగు సురేష్, మాజీ ఎంపిటిసి జనగాం నరసింహ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.