14 April, 2026 | 4:20 AM

కల్తీ కల్లు జోరు?

14-04-2026 01:38 AM

మామూళ్ల మత్తులో అధికారులు

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం

అవగాహన సదస్సులు పేట్టిన ఫలితం శూన్యమే

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కల్తీ కల్లు మాఫియా ఆగడాలు జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు కల్తీ కల్లు సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రతి  పల్లెలో నిత్యం కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

మండల కేంద్రాల్లో ఎక్సైజ్ అధికారుల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా కల్లు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నా అధికారులు పట్టించు కోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనుమతి లేని కల్లుదుకాణాలు 50 కి పైగా నిర్వహిస్తున్నారంటే ఎక్సైజ్ అధికారులు ఏమి చేస్తున్నా రో అర్థం చేసుకోవచ్చు. వారాంతపు సంతలు జరుగుతున్న ప్రాంతాల్లో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు వెలుస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వ్యాపారులకు ముందస్తు సమాచారం

కల్తీ కల్లు వ్యాపారానికి అధికారులు సహకరిస్తున్నారు. ఒకవేళ ఏ ప్రాంతానికైనా తనిఖీల కోసం వెళ్లినా.. కొందరు సిబ్బంది ముందుగానే వాప్యారస్తులకు సమాచారం ఇస్తున్నారూ. మరికొందరు అధికారులు వచ్చామా.. వెళ్లామా అనే ధోరిణిలో  వ్యవహరిస్తున్నారు. 

జిల్లాలో ఇలా..

కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో దోమకొండ, భిక్కనూర్, రాజంపేట, తాడువాయి, బిబిపేట మండలాలు ఉన్నాయి. ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ఉన్న మండల కేంద్రంలో మూడు లైన్స్ దుకాణాలు ఉండగా, ఎనిమిది కల్లు షాపుల ద్వారా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆరు అనుమతి లేని లైసెన్స్ దుకాణాల ద్వారా కల్లు విక్రయాలు కొనసాగుతుంటే, ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం సిబ్బంది ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డిపోల వద్ద ప్యూర్ కల్లు పేరా మత్తు మందు కలిపిన కల్లును అధిక ధరలకు విక్రయిస్తూ నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

నెల నెలా మామూళ్ల మత్తు

కామారెడ్డి జిల్లాలో ప్యూర్ కళ్ళు పేరిట అమ్మకాలు వచ్చే పడుతున్న ఎక్సైజ్ అధికారులు నెలనెలా మామూలు తీసుకొని తనిఖీలు మమ అనిపిస్తున్నారు. జిల్లాలోని ఓ మండల కేంద్రంలో విచ్చలవిడిగా అనుమతులు లేని కల్తీ కల్లు షాపులు అమ్మకాలు కొనసాగుతున్నాయి.

యువత జీవితాలు మత్తు తో నాశనం కాకూడదని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎక్సైజ్  అధికారులు నిరుకార్చే విధంగా అడుగులు వేస్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు మత్తు పదార్థాల విక్రయాలు అరికట్టాలని ప్రభుత్వము టోల్ ఫ్రీ నెంబర్ 1908 ప్రవేశపెట్టినప్పటికి ఎక్కడ పబ్లిక్ లో కనిపించక పోవడం, ఎవరికి తెలియక పోవడం అతికించిన పోస్టర్ లను చించి వేసినా వారిమీద  ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం ఎక్సైజ్ అధికారుల పనితీరుకు నిదర్శనం.

సీఎం ఆదేశించిన అమలు కాని వైనం

కల్తీ కల్లు ను అరికట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారు.   కల్తీ కళ్ళు తాగుతున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కల్తీ కల్లు మాఫియా దాహానికి చాటుమాటున ఆడవా ళ్లు కూడా కల్తీకల్లుకు బానిసలై సంసారాలు నాశనం అవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి.

90 మందికి పైగా

కామారెడ్డి, బాన్సువాడ , బిచ్కుంద, ఎల్లారెడ్డి, నియోజకవర్గాలలోనీ పలు మండలాల్లో కల్తీ కల్లు మాఫియా దాహానికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. బాన్సువాడ డివిజన్ లో కల్తీ కళ్ళు సేవించి 90 మంది పైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం  చర్యలు తీసుకొని కల్తీ కల్లు ను ఆరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.