7 March, 2026 | 7:54 PM

అట్రాసిటీ చట్టం బీసీలకు రక్ష!

05-03-2026 12:00 AM

నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటనలో రెండు నెలల పసిబిడ్డ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన సంఘటన మానవత్వానికి మా యని మచ్చ. ఈ ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించాయి. అయితే ప్రస్తుతమున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేవలం దళిత, గిరిజన వర్గాలకు మాత్రమే రక్షణ ఇస్తుంది. బీసీలపై కుల వివక్షతో దాడులు జరిగినప్పటికీ ఎలాంటి అట్రాసిటీ చట్టాలు లేవు.

కుమ్మరి, రజక, నాయిబ్రాహ్మణ వంటి బీసీ కులాల మీద ఆధిపత్య కు లాల దాడులు పెరుగుతున్నాయని, వారికి ప్రత్యేక రక్షణ లేకపోవడం వల్లే నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారని బీసీ నే తలు వాదిస్తున్నారు. నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష ఆధిపత్య పోకడలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రత్యేక చట్టం రావాల్సిందే. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే బీసీలు నేటికీ సామాజికంగా, రాజకీయంగా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు.

21వ శతాబ్దం లోనూ తెలంగాణలో కులం పేరుతో దూ షించడం, సామూహిక బహిష్కరణలు చే యడం, వృత్తి పనులను హేళన చేయడం ఆగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం రక్షణ కవచంలా ఉన్నప్పటికీ, జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు అటువం టి రక్షణ లేకపోవడం వల్ల ఆధిపత్య కులాల అహంకారానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీ అట్రాసిటీ రక్షణ చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కులవృత్తులపై వివక్ష..

వివక్ష అనగానే మనకు మొదట గుర్తొచ్చే ది దళిత వర్గాలే. అయితే మన బీసీలు కూ డా పిలుపు రూపంలో, పలకరించే రూపం లో, పని రూపంలో  అనునిత్యం వివక్షను ఎ దుర్కొంటూనే వస్తున్నారు. కుల వృత్తులను అవమానించేలా ‘చాకలి, మంగలి పొత్తు ఇంటికి రాదు ఇత్తు’, -‘సౌ దళాలి ఏకే కలాల్ -కుమ్మరి’,‘పురుగు-చద్రంగి పిట్ట-సాకలి’, ‘ఆడబిడ్డ కోసం సన్నాసులు కొట్టుకోవడం’, ‘దొ మ్మరిదానా-’, ‘పిచ్చకుంట్లోడా’ వంటి నోటి తో పలకరాని మాటలతో బీసీలు నిత్యం కులదూషణకు గురవుతూనే వస్తున్నారు.

బీసీల ఆహారపు అలవాట్లను కించపరిచేలా గా ‘బోడిపేగుల చాలోడా’లాంటి నింద వా క్యాలను నిత్యం ఎదుర్కొంటున్నారు. దాడు లు, అవమానాలు, సామాజిక బహిష్కరణలను అరికట్టడమే అట్రాసిటీ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. సాధారణ చట్టాలు వీరిపై జరిగే ప్రత్యేకమైన వేధింపులను అడ్డుకోవడంలో సరిపోవని భావించినందునే, అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముంది.

ఆత్మగౌరవం కాపాడాలి!

కుల పేరుతో దూషించడం, బహిరంగం గా అవమానించడం, బలవంతంగా అసభ్యకర పనులు చేయించడం వంటి చర్యల నుంచి అట్రాసిటీ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఇది సదరు వ్యక్తుల ఆత్మగౌరవాన్ని  కాపాడటానికి ఉద్దేశించినది. వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెలుతుంది. చట్టం కఠినంగా ఉంటుందనే భయం వివక్షను తగ్గించడంలో సహాయపడుతుంది. సమాజంలో తమకంటూ ఒక రక్షణ ఉందని భా వించడం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో వా రు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారముంటుంది.

సమాజం నిరంతరాయంగా నడవడానికి అనునిత్యం శ్రమిస్తున్న ఈ చెమట కులాలు దళితుల కన్నా కాస్త సా మాజికంగా గౌరవంగా బతుకుతున్నారేమే గాని ఇప్పటికీ బీసీల్లో అత్యంత వెనుకబడిన చాకలి, మంగలి, దొమ్మరి, వంశరాజ్, సంచారి కులాలు సాటి మనిషితో కలిసి కూర్చొని భోజనం చేసే పరిస్థితులు లేవు. మరి ఇది వివక్ష కిందికి రాదా? చాకలిని ముట్టుకుంటే ఏ కులంవాడైనా స్నానం చేయనిదే ఇంట్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి నేటికీ ఉందన్నది నిజం కాదా? బీసీల్లో అత్యంత వెనుకబడిన వారు, సంచారుల పరిస్థితి మరీ దారుణం.

అసలు వాళ్ల కులం పేర్లే తిట్లుగా మారిన పరిస్థితి. ఎస్సీ, ఎస్టీల కన్నా నీచమైన బతుకులు ఎంబీసీలు, సంచార జాతులదేనని చాలా కమిషన్లు కుండబద్దలు కొట్టాయి. వివక్షలను, వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ ప్రతిఘటించిన సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా?  అయితే బీసీలను వివక్షకు గురి చేస్తున్నదీ దళితులు కాదు ఆదిపత్య కులాలే. ఎప్పుడైనా ప్రశ్నించాల్సి వస్తే అగ్రాధిపత్యం ఊరవతల ఉన్న వర్గాల వైపు చూపెట్టడం, దానితో వాళ్ల కన్నా మనం బాగానే బతుకుతున్నామనే భ్రమలో ఉన్నందునే బీసీ వాదం  బలపడటం లేదు. 

శ్రమ దోపిడీ..

సమాజంలో బీసీ కులాల పేర్లు గౌరవప్రదంగా కాకుండా తిట్లుగా మారుతున్నాయి. ‘ఒరేయ్ సాకలోడా, గొల్లోడా, మంగళోడా, మున్నూరోడా.. అంటూ సంబోధించడం వెనుక ప్రేమాభిమానాలు లేవు, శతాబ్దాల నాటి అహంకారం ఉంది. గంగిరెద్దులోళ్లు, పిచ్చకుంట్లోళ్లు వంటి సంచార జాతుల నుంచి ముదిరాజ్, గౌడ, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆధిపత్య కులాల వివక్షను ఎదుర్కొన్నవారే.

ఇటీవల రాజకీయాల్లో ఒక బీసీ నాయకుడిని అవమానిస్తూ రెడ్డి మహిళలు దిష్టిబొమ్మలు దహనం చేయడం, శవయాత్రలు నిర్వహించడం వంటి ఘటనలు వారి అహంకారానికి పరాకాష్ట. రాజకీయ, ఆర్థిక అడ్డంకులు తెలంగాణలో అధికారం కొన్ని వర్గాల చేతుల్లోనే బందీ అయి ఉంది. బీసీలు ఆర్థికంగా ఎదగకుండా, రాజకీయంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా ఆధిపత్య కులాలు కుట్రలు చేస్తున్నాయి. గ్రామీణ ఆర్థికవ్యవస్థపై పట్టు సాధించి, బీసీల శ్రమను పన్నుల రూపంలో దోచుకుంటూ, తిరిగి వారినే అభివృద్ధికి దూ రం చేస్తున్నారు.

బీసీలు ఐక్యమవ్వకుం డా ఉండేందుకు ఓబీసీ, ఎంబీసీ అంటూ విభజన రేఖను సృష్టిస్తున్నారు. యూపీ, బీహార్ రాజకీయాలను ఇక్కడికి అన్వయిస్తూ ఎదుగుతున్న బీసీ కులాలను వేరు చేసే కుట్రను మనం గమనించాలి. బీసీలందరూ ఒకే తా టిపైకి వచ్చి ఉమ్మడి అస్తిత్వం కోసం పోరాడాలి. బహిష్కరణే కాదు దాడులు, హత్యలు కూడా జరిగాయి. అటు కేంద్రం, ఇటు రా ష్ట్రంలోని ఆదిపత్య కులాలు.. గౌడ, యాదవ, ముదిరాజ్, మున్నూరు కాపు, పద్మశాలి కులాల ప్రజలను విద్యా, ఉద్యోగాలు, రాజకీయం పరంగా ఎదుగుతున్నార న్న అక్కసు తో వీరిని బీసీల నుంచి వేరు చే యాలనే కు ట్ర జరుగుతుంది.

ఈ క్రమంలో కొద్దిమంది ఉమ్మడి బీసీ చైతన్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వుంటున్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించుకొని ఉమ్మడి గా ముందు కు పోవాల్సిన అవసరముంది. బీసీలపై జరి గే సామాజిక వివక్షను అరికట్టడానికి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడటానికి ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలోనే బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 9177566741