మెట్రోపై రేవంత్ కన్ను!
- 30 వేల కోట్ల విలువైన 250 ఎకరాల భూముల దోపిడీకి కుట్ర
- కుటుంబ సభ్యులు, అన్నాదమ్ములు, అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం
- సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిసి డ్రామాలు
- అందుకే ఎల్‌అండ్‌టీని బెదిరించి, రాష్ట్రం నుంచి తరిమేశారు
- రేవంత్ ఏ స్కీం తెచ్చినా దాని వెనకా స్కాం పక్కా!
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రంగారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన 250 ఎకరాల భూములపై పై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వీటిని తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణానికి తెరలేపా రని విమర్శించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఏ స్కీం తెచ్చినా దాని వెనకా ఓ స్కాం ఉం టుందని ఆరోపించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న రూ.30 వేల కోట్ల విలువైన 250 ఎకరాల భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను పడిందని, ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నద మ్ములకు, అనుచరులకు అప్పజెప్పేందుకు భారీ కుంభకోణానికి తెర లేపారని ఆరోపించారు.
అందుకే ఎల్ అండ్ టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తరిమేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రూ.14 వేల కోట్ల ఎల్ అండ్ టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రేవంత్‌రెడ్డి రుద్దుతూ మెట్రో రైళ్లను దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ వేదిక గా సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్ నుంచి పటాన్ చెరు మెట్రో విస్తరణకు కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నించారు. అత్యధిక జనసాంద్ర త కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఎలాంటి భూసేకర ణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేస్తే, రేవంత్‌రెడ్డి రద్దు చేశార న్నారు. గత ప్రభుత్వ ప్రణాళికల హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని, లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పేవని కేటీఆర్ అన్నారు.
రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుం చి కిషన్‌రెడ్డి ఏదో తీసుకువచ్చినట్లు కలిసి ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని అన్నారు. హైదరాబాద్‌లో అడ్డగో లుగా విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసిన రేవంత్‌రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర మంత్రి కిష న్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి చేసే కుంభకోణం గురించి ముందే చెప్తూ వస్తున్నా మని, ఈసారి కూడా మెట్రో రైలు పేరు తో చేయబోతున్న కుంభకోణం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పే ర్కొన్నారు. మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల విలువైన భూములను భవిష్యత్తులో ఎవరు కొంటారు, ఎవరు అమ్ము తారు, అవన్నీ చివరికి రేవంత్‌రెడ్డి కుటుం బ సభ్యులకు ఎలా చేరుతాయో అన్ని ప్రజల ముందుకే వస్తాయన్నారు.
కాంగ్రె స్ పార్టీ మొదలుపెట్టి వదిలేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని 70 శాతానికి పైగా కేసీఆర్ పూర్తి చేసి అందుబాటు లోకి తెచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టా లు ఎక్కాలి అంటే, ఎక్కాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.
రేవంత్‌రెడ్డికి తుగ్లక్, హిట్లర్ ఆదర్శం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి తుగ్లక్, హిట్లర్ ఆదర్శంగా తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ ఆలోచన విధానం ఉంది కాబట్టే గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని రకాల ప్రజా ప్రయోజన ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, కనీసం తన సొంత ఆలోచన మేరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షల మంది ఇండ్లను కూలగొట్టి, మూసీ ప్రాజెక్టు పే రుతో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు.
లక్షన్నర కోట్లతో మూసీ సుంద రీకరణ చేసేందుకు డబ్బులు ఉంటాయి కానీ, ఇచ్చిన హామీలను, డిక్లరేషన్లను అమలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవని విమర్శించారు. బీఆర్‌ఎస్ కా ర్యకర్తల కష్టంతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ తన అవినీతి, అక్రమాలను కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ కాలం లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి 9,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రగతి నివేదికను విడుదల చేశారని, మరి రెండు సంవత్సరాలలో ఎన్ని నిధులు తెచ్చారో గాంధీ చెప్పాలన్నారు. శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలి అంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.






