calender_icon.png 22 January, 2026 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

19-09-2024 01:16:54 AM

కరీంనగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కరీంనగర్ నగ ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌పై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. నగరంలోని రాంనగర్ ప్రాం తంలో హరిశంకర్‌కు చెందిన గణపతి నిమజ్జన శోభాయాత్ర సాగుతున్నది. ఆ సమయంలో రాంనగర్‌కు చెందిన వినాయక ఊరేగింపు వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన హరిశంకర్ గు గులోతు శ్రీకాంత్‌నాయక్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించాడు. గుగులోతు శ్రీకాంత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా హరిశంకర్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది.