calender_icon.png 22 January, 2026 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇనుముల’పై మరో కేసు

19-09-2024 01:15:18 AM

మంథని, సెప్టెంబర్ 18: మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయపై మరో కేసు నమోదైంది. ముత్తారం మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ కుమా రుడు బిరుదు శ్రీనివాస్ సూరయ్యపల్లి శివారులో బాంకెట్ హాల్ నిర్మా ణం చేపట్టాడు. ఆ హాలు నిర్మాణం సాఫీగా సాగాలంటే తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఇనుముల సత్యనారాయణ బెదిరింపులకు పాల్పడ్డాడు. సత్యనారాయణ అనుచరుడు రావికంటి సతీష్ కూడా శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి ఇనుముల అడిగినంత ఇవ్వాల్సిందేనని, మరో మార్గం లేదంటూ బెది రింపులకు గురి చేశాడు.

దీంతో శ్రీనివాస్ రావికంటి సతీశ్‌కు రూ.5 లక్షలు పంపించాడు. ఆగస్టు నెలలో ఇనుముల గన్‌మెన్, రావికంటి సతీశ్ మళ్లీ శ్రీనివాస్ వద్దకు వెళ్లి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బాంకెట్ హాలు కూల్చివేయిస్తామని బెదిరించారు. దీంతో శ్రీనివాస్ మంథని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇనుముల సత్యనారాయణపై బుధవారం కేసు నమోదు చేశారు.