9 July, 2026 | 5:09 AM

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

23-06-2025 12:00 AM

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గిరిజన తెగల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా, వారి సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే  పలు గిరిజన సంఘాల నాయకులు ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.