17 April, 2026 | 11:12 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చెట్ల కొమ్మలను తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

23-06-2025 12:00 AM

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లో గత కొన్ని రోజులుగా వర్షా కాలం దృష్ట్యా విద్యుత్ తీగలు ఫీడర్ల పై అనుకొని వున్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది ఆదివారం  తొలగించారు. రోడ్లపై చెట్ల కొమ్మల కుప్పలు పేరుకుపోవడంతో  డివిజన్ ప్రజలు గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్  జిహెచ్‌ఎంసి కమిషనర్ తో సమస్య పై సమీక్షించి, చెట్ల కొమ్మలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవా లని కోరారు.

కమిషనర్ ఆదేశాల మేరకు  స్పెషల్ డ్రైవ్ క్రింద వెహికల్స్ ఏర్పాటు చేసి చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ వ్యాప్తంగా రోడ్లపై  కుప్పలుగా పేరుకుపోయిన చెట్ల కొమ్మల ను  జిహెచ్‌ఎంసి సిబ్బంది తొలగించారు. కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమా ర్  పర్యవేక్షించారు. బీజేపీ నేతలు ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్ ఉన్నారు.