24-12-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, డిసెంబర్ 23 : జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులను త్వరగా విచారించి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఎస్సి, ఎస్టి అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డిసిపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఆర్ డీ ఓ శ్రీనివాస్ రావు, షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి పోలీస్, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు, నూ తనంగా ఎన్నికైన ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నారాయణ, రాజనర్సు, రాజారావు, ఎల్లయ్య, రాజన్న, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, జిల్లా గ్రామీణ అభివృద్ధి కిషన్, జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ తదితరులు పాల్గొన్నారు.