24-12-2025 12:00:00 AM
నిర్మల్, డిసెంబర్ ౨3 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమై న శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో దుకాణాలకు టెండర్ల వేలాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వివిధ దుకాణాల నిర్వాణకు ఈ టెండర్ విధానంలో వేలంపాట నిర్వహించినట్టు ఆలయ నిర్వహణ అధికారి అంజనీదేవి తెలి పారు. ఈ టెండర్లలో రూ.2.28 కోట్ల ఆదాయం సమకూర్చినట్టు ఆమె తెలిపారు. పారదర్శ కంగా దుకాణాల టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.