24-12-2025 12:00:00 AM
ఉట్నూర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన మెస్రం వంశస్తులను మంగళవారం సన్మానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో మెస్రం వంశస్థుల నుండి సర్పంచ్ పదులకు పోటీ చేసి విజయం సాధించిన 18 మంది సర్పంచులను నాగోబా ఆలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పీఠాధిపతి మెస్రం వెంకట్రావు మాట్లాడుతూ... ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నూతన సర్పంచులకు సూచించారు.